Larry Tesler, inventor of 'cut, copy, and paste !
లారీ టెస్లెర్ ఒక ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు యూజర్ ఇంటర్ఫేస్ నిపుణుడు. అతను మానవ – కంప్యూటర్ పరస్పర చర్యకు గణనీయమైన కృషి చేశాడు. లారీ టెస్ట్లర్ “Cut, Copy and Paste” ఫంక్షనాలిటీని కనిపెట్టిన ఘనత అతనిదే. ఇది ఇప్పుడు ఆధునిక కంప్యూటర్లలో
Tencent -the world's biggest video game company !
Tencent ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటి. ఇది చైనా దేశానికి సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది తన మార్కెట్ ను కలిగి ఉంది. గేమింగ్ పరిశ్రమలో ప్రధానంగా ఇది తన ఉనికిని కలిగి ఉంది.ఇది Riot(league of legends
ఆట సృష్టికర్త) మరియు Supercell(clash of clans ఆట సృష్టికర్త) కంపెనీలను సొంతం చేసుకుంది మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర గేమింగ్ కంపెనీలో వాటాలను కలిగి ఉంది. ఇది రెవెన్యూ విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్ పబ్లిషర్ కూడా.టెన్సెంట్ యొక్క WeChat అనేది Multi purpose messaging, సోషల్ మీడియా మరియు మొబైల్ చెల్లింపు యాప్.
Gorilla Glass: the unsung hero of the smartphone
గొరిల్లా గ్లాస్ అనేది ప్రత్యేకమైన బలం, మరియు స్క్రాచ్ రెసిస్టెన్స్ ని అందిస్తుంది. ఇది వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్లు మరియు టాబ్లెట్లకు అనుకూలంగా ఉంటుంది. గొరిల్లా గ్లాస్ ఫ్యూచర్ తో చేసిన మొదటి ప్రధాన పరికరం 2007లో విడుదలైన యాపిల్ ఐఫోన్. ఇది
VisiCalc-The First Ever SpreadSheet Program
VisiCalc మొదటి కంప్యూటర్ స్ప్రెడ్ షీట్ ప్రోగ్రాం. ఇది 1979లో ఆపిల్ 2 కంప్యూటర్ లో ప్రవేశపెట్టబడింది. ప్రారంభ మైక్రోప్రాసర్ కంప్యూటర్లకు Basic లాంగ్వేజ్ తో పాటుగా మరికొన్ని గేములు సపోర్ట్ చేసేవి. VisiCalc అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ లో ఒక కొత్త స్థాయిని ప్రవేశపెట్టింది.ఇది నాలుగవ .
తరం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ గా పరిగణించబడింది.మాన్యువల్ గా లెక్కించబడిన స్ప్రెడ్ షీట్లతో అంచనాలు వేయడంలో కంపెనీలు సమయం మరియు డబ్బును వెచ్చించేవి. ఇక్కడ ఒక సంఖ్యను మార్చినట్లయితే షీట్ లోని ప్రతి సెల్ ను మళ్లీ లెక్కించ వలసి వచ్చేది. కానీ VisiCalc తో, మీరు ఏదైనా సెల్ లోని డేటాను మార్చినట్లయితే అది మొత్తం డేటాను ఆటోమేటిక్ గా తిరిగి లెక్కిస్తుంది
IBM patents: the foundation of innovation and discovery
IBM అనేక సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పేటెంట్లు నమోదు చేయడంలో స్థిరంగా తన స్థానాలను నిలబెట్టుకుంది.IBM వరుసగా 28 సంవత్సరాల పాటు తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.IBM శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు 2020లో 9,130 US పేటెంట్లను పొందారు.IBM
Ray Kurzweil's Most Exciting Predictions About the Future of Humanity
Ray kurtzweil ప్రపంచంలోని ప్రముఖ ప్రముఖ ఆవిష్కర్తగా, ఆలోచనపరుడుగా, దూరదృష్టి కలవాడుగా పేరుపొందాడు.ఖచ్చితమైన అంచనాలను వేయడంలో ఇతడికి 30 సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉంది.ప్రముఖ అమెరికన్ పత్రిక “ది వాల్ స్ట్రీట్ జనరల్” చేత ” ది రెస్ట్ లెస్ జీనియస్” అని
మరియు ఫార్బ్స్ మ్యాగజైన్ ద్వారా " ది అల్టిమేట్ థింకింగ్ మిషన్ " అని పిలవబడే Kurtzweil ను Inc. మ్యాగజిన్ థామస్ ఆల్వా ఎడిసన్ కు వారసుడిగా అభివర్ణించింది.ఇతడు 1990 నుండి 147 predictions చేయగా అవి 86% కచ్చితత్వంతో నిజం అయ్యాయి.2009 నాటికి వ్యక్తులు ప్రధానంగా పోర్టబుల్ కంప్యూటర్లను ఉపయోగిస్తారని,యోదారులు వారి సమాచారం,సంగీతం, చలనచిత్రాలను వారి కంప్యూటర్లలో మరియు పరికరాలలో నిలువ చేస్తారని, కంప్యూటర్లు వీడియో కెమెరాలు మరియు ముఖాన్ని గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని మరియు ఇలాంటి ఎన్నో సాంకేతిక అంశాలు,1990 లో ఇతడు ఊహించాడు.
The Fortran Programming Language
Fortran ను 1950లలో IBM తొలి ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ భాషల్లో ఒకటిగా అభివృద్ధి చేసింది. ఇది ప్రత్యేకంగా శాస్త్రీయ మరియు ఇంజనీరింగ్ లెక్కల కోసం రూపొందించబడింది. ఫోర్ట్రాన్ సుదీర్ఘమైన మరియు శాశ్వతమైన చరిత్రను కలిగి ఉంది. ఇది ఇప్పటికీ వాడుకలో ఉన్న పురాతన
ప్రోగ్రాం భాషల్లో ఒకటిగా నిలిచింది. ఇది తదుపరి ప్రోగ్రామింగ్ భాషల అభివృద్ధి పై గణితమైన ప్రభావాన్ని చూపింది.ఫోర్ట్రాన్ సంఖ్యాపరమైన కంప్యూటర్ పై బలమైన ప్రాధాన్యతతో రూపొందించబడింది. గణిత కార్యకలాపాలు, శ్రేణులు(arrays) మరియు సంక్లిష్ట డేటా నిర్మాణాలకు ఇది పూర్తిగా మద్దతునిస్తుంది.Fortran శాస్త్రీయ మరియు సంఖ్యా గణనల లో అధిక పని తీరు (high performance)ను అందించడంలో ఖ్యాతిని కలిగి ఉంది.దీని సింటాక్స్ (syntax)మరియు ఆప్టిమైజేషన్ సామర్ధ్యాలు గణనపరంగా ఇంటెన్సివ్ అప్లికేషన్లకు బాగా సరిపోతాయి.
Bug Bounty Programs
ప్రోగ్రాములు తమ సాఫ్ట్వేర్, సిస్టంలు లేదా డిజిటల్ ఇన్స్ట్రా స్ట్రక్చర్ లోని లోపాలను గుర్తించి మరియు నివేదించడంలో నైతిక హాకర్(Ethical Hacker) ల శక్తిని ఉపయోగించుకోవడానికి సంస్థలు ప్రారంభించిన కార్యక్రమాలు.బగ్ బౌంటి ప్రోగ్రాంల ప్రాథమిక లక్ష్యం సాఫ్ట్వేర్ మరియు
సిస్టంలో భద్రతను మెరుగుపరచడం.భద్రత లోపాలను కనుగొనడానికి నైతిక హాకర్లను ప్రోత్సహించడం ద్వారా చెడ్డ వ్యక్తులు తమ దుర్మార్గపు ప్రయోజనాల కోసం వాటిని వాడుకునే ముందు సంస్థలు ఈ సమస్యలను గుర్తించి పరిష్కరించగలవు. బక్ బౌంటీ ప్రోగ్రాములు సాధారణంగా ప్రోగ్రాం యొక్క పరిధిని నిర్వచిస్తాయి.భద్రతా లోపాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి ఎక్కడ పరీక్షలు చేయాలో నిర్దేశిస్తాయి.ఇందులో వెబ్ అప్లికేషన్లు, మొబైల్ యాప్ లు, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, IoT పరికరాలు లేదా హార్డ్వేర్ భాగాలు కూడా ఉండవచ్చు.
PUBG-The Best Battle Royale Game
PUBG ఎందుకు అంత జనాలను పొందింది అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఇది గొప్ప గేమ్ మాత్రమే కాదు. ఇది PC, Xbox One, Android మరియు iOS తో సహా ప్రతి ప్రధాన ప్లాట్ఫారంలో అందుబాటులో ఉండటం కూడా దీనికి కారణం.అంతేకాదు ఇది ఆడటానికి కూడా పూర్తిగా ఉచితం. మీరు
అత్యుత్తమ PUBG ప్లేయర్ గా ఎదగాలనుకుంటే, మీరు ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా చేయవచ్చు. PUBG అనేది చాలా వాస్తవిక యుద్ధ రాయల్ గేమ్. ఇది అధిక నాణ్యత విజువల్స్ మరియు లైఫ్ లైక్ సౌండ్ ఎఫెక్టులను కలిగి ఉంటుంది. మీరు ఆడే ప్రతిసారి గేమ్ లో మీరు నిజంగానే ఉన్నారని అనుభూతిని ఇస్తుంది.తరచుగా అప్డేట్లు మరియు కొత్త కంటెంట్ జోడించబడటం వల్ల ఆట నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఎక్కువ రీప్లేయబిలిటీ కూడా అందిస్తుంది.మీరు క్యాజువల్ ప్లేయర్ అయినా లేదా హార్డ్ కోర్ గేమర్ అయినా మీరు ఈ గేమ్ నుండి అత్యధిక ప్రయోజనాలను పొందవచ్చు మరియు మీ సొంత నిబంధన ప్రకారం ఆనందించవచ్చు. అదే PUBG వంటి గేమ్ ను చాలా అద్భుతమైనదిగా చేసింది.
The story behind Google's Doodles
Google అతిపెద్ద మరియు అత్యంత ప్రజాధరణ పొందిన సెర్చింగ్ ఇంజిన్. మనం ఏదైనా వెతకడానికి గూగుల్ ను తెరిచినప్పుడు దాని హోం పేజీలో గూగుల్ లోగో కనిపిస్తుంది. Doodle అనేది Google లోగో యొక్క కరాత్మక రూపం. ఈవెంట్లు, సందర్భాలు, సెలవులు, వార్షికోత్సవాలు
మరియు ప్రసిద్ధ వ్యక్తుల జీవితాలను గుర్తుచేసుకొని వేడుక చేసుకోవడానికి Google లోగో లో కొన్ని ఆసక్తికరమైన మార్పులను చేసింది. బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ ( అమెరికన్ ఈవెంట్) గౌరవార్థం 1998 వ సంవత్సరంలో మొదటి doodle రూపొందించబడింది.ఈ గూగుల్ ను google వ్యవస్థాపకులైన లారీ పేజ్ మరియు సెర్గిబ్రిన్ లు రూపొందించారు. మొట్టమొదటి యానిమేటెడ్ గూగుల్ డూడుల్ 2010లో ప్రసిద్ధ శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ పుట్టినరోజు సందర్భంగా పోస్ట్ చేయబడింది.ఇది చెట్టు నుండి పడిపోయిన ఆపిల్ యొక్క అందమైన యానిమేటెడ్ చిత్రం.
