Douglas Engelbar-| Inventor of the Computer Mouse
మొదటి కంప్యూటర్ మౌస్ 1960ల ప్రారంభంలో అభివృద్ధి చేయబడింది. డిస్ప్లే సిస్టం కోసం X-Y పొజిషన్ ఇండికేటర్ గా పిలవబడే ప్రోటో టైపు డిసెంబర్ 9, 1968 న మొదటిసారిగా బహిరంగంగా ప్రవేశించబడింది.స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నప్పుడు కంప్యూటర్ మౌస్ ను
అమెరికన్ ఇంజనీర్ మరియు ఆవిష్కర్త Douglas Engelbart కనుగొన్నారు.ఇంటరాక్టివ్ కంప్యూటింగ్ మెరుగుపరచడానికి ఒక పెద్ద ప్రాజెక్టులో భాగంగా అతను మౌస్ ను అభివృద్ధి చేశాడు.ఈ కంప్యూటర్ మౌస్ చెక్కతో తయారు చేయబడింది. ఇది రెండు లంబ చక్రాలతో దీర్ఘ చతురస్రాకార ఆకారాన్ని కలిగి ఉంది.ఒకటి X- అక్షం కోసం మరియు మరొకటి y- యాక్సిస్ కదలిక కోసం.ఇది వినియోగదారులు ఆన్ స్క్రీన్ కర్సర్ ను ఏ దిశలోనైనా తరలించడానికి అనుమతించింది.
Why Linux is the Most Popular Operating System?
Linux ఓపెన్ సోర్స్ సిస్టం కాబట్టి దీన్ని పూర్తిగా అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ కోడ్ లోని ఏదైనా భాగాన్ని ఉచితంగా సవరించడానికి అనుమతిస్తుంది.పనితీరును మెరుగుపరచడానికి మరియు ఏదైనా భద్రత సమస్యను పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది.దీనిలో కేవలం
ముఖ్యమైన అప్లికేషన్లను మాత్రమే రన్ చేయడం వల్ల పనితీరును మెరుగుపరచవచ్చు.ఇతర ఆపరేటింగ్ సిస్టంలో ఇది చేయలేము ఎందుకంటే అవి సాధారణంగా నిర్దిష్ట కాన్ఫిగరేషన్ల ను అనుమతించవు.మాడ్యులార్ నిర్మాణం అనేది Linux యొక్క అతి ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి. లైన్ ఎక్స్ పూర్తిగా ఓపెన్ సోర్స్ అవడం వల్ల ఆపరేటింగ్ సిస్టం లోని ఇతర భాగాలను ప్రభావితం చేయకుండా కొత్త మాడ్యూల్స్ జోడించబడతాయి.అంతేకాకుండా రిసోర్స్ ఆప్టిమైజేషన్ కూడా చాలా సులభం.అంతేకాకుండా అన్ని రకాల పని భారానికి తగ్గట్టు, అన్ని రకాల వర్క్ లోడ్లకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేయగలదు.ఇది పూర్తిగా ఉచితం కాబట్టి దీని ఉపయోగించడానికి లైసెన్స్ కోసం చెల్లించాల్సిన అవసరం లేదు.కాబట్టి ప్రతి ప్రాజెక్టు కోసం OS ని సవరించడం కోసం తీసుకునే సమయం మాత్రమే దీనికి పెట్టే పెట్టుబడి.
Samsung is reborn
కంపెనీ ప్రారంభమైన కొత్తలో Samsung అంతగా విజయవంతం కాలేదు. 1980 నుండి 1990 వరకు Samsung ఉత్పత్తులు అంత ప్రజాదరణ పొందలేదు. వారు అప్పటివరకు తక్కువ నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేయడమే దీనికి కారణం. కానీ 1993లో Lee Kun Hee Samsung
కంపెనీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాడు. అతడు Samsung కంపెనీ ని వ్యవస్థాపకుడు Byunh Chul కుమారుడు.కంపెనీని నాణ్యత ప్రమాణికంగా కొత్త మేనేజ్మెంట్ ఫిలాసఫీతో కంపెనీ నడపాలనుకున్నాడు. ఆ తర్వాత కూడా సాంసంగ్ చెత్త ఉత్పత్తులను సరఫరా చేసింది.ఫలితంగా, 1995లో ఒకరోజు, అతను ఒక శాంసంగ్ ఫ్యాక్టరీ కి వెళ్లి అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఒక వరుసలో ఉంచి వాటిలో కొన్నింటిని మంటల్లో వేయడం ద్వారా నాశనం చేశాడు మరి కొన్ని ఉత్పత్తులను సుత్తితో ధ్వంసం చేశాడు.మొత్తం మీద ఆరోజు 50 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అతడు ధ్వంసం చేసినట్లు సమాచారం. 2000 మంది సామ్సంగ్ ఉద్యోగులు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నారు.ఆ ఎపిసోడ్ శామ్సంగ్ పరివర్తనకు నాంది పలికింది.అప్పటినుండి కొత్త Samsung ప్రపంచంలోనే అత్యుత్తమ బహుళ జాతీయ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది.
Bill Gates wrote his first computer program tic-tac-toe
బిల్ గేట్స్ తన చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ పై తన ఆసక్తిని పెంచుకున్నాడు. అమెరికాలోని Seatelle పట్టణంలో లేక్ సైడ్ స్కూల్లో విద్యార్థిగా సాఫ్ట్వేర్ రాయడం ప్రారంభించాడు. అక్కడే అతను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ ను కలిశాడు. గేట్స్ రాసిన మొట్ట మొదటి సాఫ్ట్వేర్
ప్రోగ్రాం tic-toc-toe అనబడే గేమ్ యొక్క డిజిటల్ వర్షన్.1960లో తాను ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు అప్పటి కంప్యూటర్లు నేటి తరం కంప్యూటర్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి.కంప్యూటర్ టెరమినల్స్ కు స్క్రీన్ లు ఉండేవి కాదు అని బిల్ గేట్స్ గుర్తు చేసుకున్నారు.ఆడేందుకు టైపు రైటర్ పద్ధతిలో ఉండే కీబోర్డులో ఆటగాళ్ల కదలికను టైప్ చేసేవారు.ప్రతి కదలికను కంప్యూటర్ ప్రింట్ అవుట్ చేయడానికి ఆటగాళ్లు చాలా సమయం వేచి చూడాల్సి వచ్చేది.
Xerox Alto computer A revolutionary machine!
అనేక సంవత్సరాలుగా యూనిట్లు జిరాక్స్ PARC లో మరియు ఇతర జిరాక్స్ ఆఫీసులలో మరియు ప్రముఖ కళాశాలలో వాడబడుతూ ఉండేవి.సాధారణ వ్యక్తిగత బడ్జెట్లో కొనుగోలు చేయబడడానికి అందుబాటులో ఉండేది కాదు.ఆల్టో సమకాలీన గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్
కాంపోనెంట్స్ (GUI) ని కలిగి ఉన్న మొదటి సిస్టం. ఇథర్నెట్ అని పిలవబడే LAN సాంకేతికత ని ఉపయోగించిన మొదటి సిస్టం.అంతేకాకుండా WYSIWYG ప్రింటింగ్ అంటే మనం స్క్రీన్ పై చూసిన దాన్ని అదేవిధంగా ముద్రించడం మరియు ఈమెయిల్ సౌకర్యాలు,ఒక మౌస్,రిమూవబుల్ డేటా స్టోరేజ్ అన్నీ కలిసి ఈ సిస్టం లో ఉన్నాయి.
Microsoft Embraced Gaming
మైక్రోసాఫ్ట్ లో పనిచేసిన Kevin Bachus, Ted Hase, Otto Berkes and Seamus Blackley నీ పేరు గల నలుగురు వ్యక్తులు బిల్ గేట్స్ కు గేమింగ్ కన్సోల్ కాన్సెప్ట్ ను సచ్చిపాదించారు.బిల్ గేట్స్ ప్రతిపాదనను ఆమోదించిన వెంటనే వారు పనిని ప్రారంభించారు. వారు మొదటి గేమింగ్ కన్సోల్
xbox ను కేవలం 20 నెలలోనే ప్రజలకు సిద్ధం చేశారు.ఈ కన్సోల్ యునైటెడ్ స్టేట్స్ లో భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మొదటి సీజన్లో, మైక్రోసాఫ్ట్ 1.5 మిలిన్లకు పైగా కన్సోల్ లను విక్రయించింది.రెండవ Xbox మరియు Xbox360, 2005 వ సంవత్సరంలో విడుదల అయ్యాయి. అక్టోబర్ 2021 నాటికి Xbox360 సుమారు 86 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి.
Zuckerberg made his 1st messaging program ZuckNet at the age of 12!
Facebook సహాయస్థాపకుడు మరియు CEO మార్క్ జుకర్ బర్గ్ తన 12 సంవత్సరాల వయసులో ‘Zucknet’ అని పిలవబడే ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ (messaging system) తయారు చేశాడు. దీని అతని కుటుంబం ఇంట్లో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించింది. అతని తండ్రి తన
డెంటల్ఆఫీసులో తన రిసెప్షనిస్టు రోగి గురించి అరిచి చెప్పకుండా ఉండడానికి దీని దీనిని తన ఆఫీసులో ఉపయోగించాడు మరియు హాస్పిటల్ పైభాగంలో ఉన్న తమ ఇంట్లో తనను మరియు తన చెల్లిని కూడా తన తండ్రి కమ్యూనికేట్ చేయడానికి దీనిని ఉపయోగించేవారు.ఇది అప్పట్లో అత్యంత పొందిన AOL ఇన్స్టంట్ మెసెంజర్ కు చాలా దగ్గర పోలికగా ఉండేది.అంతేకాకుండా జుకర్ బర్గ్ Synapse అనబడే మీడియా ప్లేయర్ ని కూడా తయారు చేశాడు. అది మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్ ని ఉపయోగించుకుని వినియోగదారుల యొక్క సంగీతమైన అలవాట్లను గుర్తించడానికి మరియు వారి అభిరుచులకు అనుగుణంగా మరింత సంగీతాన్ని సిఫార్సు చేసేది.Microsoft మరియు AOL రెండూ సినాప్స్ కొనుగోలు కోసం జుకర్ బర్గ్ ను సంప్రదించాయి మరియు అతనికి జాబ్ ఆఫర్ ను కూడా ఇచ్చాయి. కానీ వాటిని తిరస్కరించాడు మరియు యాప్ ను ఆన్లైన్లో ఉచితంగా పోస్ట్ చేశాడు.
IBM Makes first 2nm chip !
2021 వ సంవత్సరంలో ప్రసిద్ధ టెక్నాలజీ సంస్థ IBM 2nm చిప్ ను పరిచయం చేయడం ద్వారా చరిత్ర సూచించింది.అంటే ఇది ప్రపంచంలోనే అతి చిన్న చిప్ గా భావించవచ్చు.ఇప్పుడు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు, మరియు లాప్టాప్ లలో 5nm చిప్ లతో పోలిస్తే IBM తయారుచేసిన ఈ చిప్
మానవ వేలిముద్ర పరిమాణంలో 333 మిలియన్ ట్రాన్సిస్టర్లను ముంచడానికి అనుమతినిస్తుంది.చిన్న పరిమాణంలో ఉన్న చిప్ లు పనిచేరి విషయంలోనూ, మరియు బ్యాటరీ జీవితకాలం విషయంలోనూ భారీ ప్రయోజనాలను అందిస్తాయి.IBM దాని 2nm చిప్ 45 శాతం అధిక పనితీరును సాధించగలరని లేదా నేటి అత్యంత అధునాతన 7nm చిప్ కంటే 75 శాతం తక్కువ శక్తిని ఆదా చేయగలరని అంచనా వేసింది.ప్రస్తుతానికి IBM యొక్క 2nm ఒక కాన్సెప్ట్ స్థాయిలోనే ఉంది. కొత్త 2nm రోడ్డుపై నిర్మించిన ప్రాసెసర్ మరికొన్ని సంవత్సరాల్లో ప్రారంభపడుతుందని ఆశించవచ్చు.
How Micro controller works?
మైక్రో కంట్రోలర్ లను ఒకే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) పై ఉండే చిన్న కంప్యూటర్లుగా పేర్కొనవచ్చు.అవి నిర్దిష్ట పనులను నిర్వహించడానికి అవసరమైన ప్రాసెసర్, మెమరీ, ఇన్పుట్ అవుట్ ఫుట్ పెరిఫెరల్స్ మరియు ఇతర ముఖ్యమైన భాగాలను కలిగి ఉంటాయి.అవి చాలా చిన్న
సైజులో ఉన్నప్పటికీ సంక్లిష్టమైన ఆపరేషన్ల ను అమలు చేయగలవు.మైక్రో కంట్రోలర్లు అధిక సమర్థవంతంగా ఉండేలా రూపొందించబడి బ్యాటరీ తో పని చేసే పరికరాలు మరియు శక్తి ఆదా అవసరమయ్యే అప్లికేషన్ లకు కనుకూలంగా ఉంటాయి.మైక్రో కంట్రోలర్ లు సాధారణంగా ఎంబెడెడ్ సిస్టంలో ఉపయోగించబడతాయి.అవి పెద్ద సిస్టంలో లలో మరియు పరికరాలలో కొన్ని రకాలైన పనులను నియంత్రిస్తూ మరియు నిర్వహిస్తూ ఉంటాయి.ఉదాహరణకు గృహోపకరణాలు, ఆటోమోటివ్ సిస్టంలు, వైద్య పరికరాలు మరియు పారిశ్రామిక యంత్రాలు. అంతేకాకుండా మైక్రో కంట్రోలర్లను రోబోటిక్స్, ఆటోమేషన్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ హోం డివైజ్ లు, వేరే బుల్స్ వంటి మరిన్ని విభిన్న రంగాలలో వీటిని వాడుతారు.
Adobe Flash Player:The End of an Era !
Adobe డిసెంబర్ 31, 2020 న Adobe Flash Player కి మద్దతును నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది మరియు జనవరి 12, 2021న Flash కంటెంట్ ను అమలు చేయకుండా బ్లాక్ చేసింది.దీనికి అనేక కారణాలు దోహదపడ్డాయి.భద్రతా లోపాలపరంగా Flash player సుదీర్ఘ చరిత్రను కలిగి
ఉంది.సైబర్ ఎటాక్‌లను ప్రారంభించడానికి హ్యాకర్లు తరచుగా ఈ లోపాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది వినియోగదారుల డేటా మరియు సిస్టం లో భద్రత గురించి ఆందోళనకు దారి తీసింది.కాలక్రమేనా భద్రతకు సంబంధించిన అప్డేట్స్ కు మద్దతుగా నిలవడం Adobe కి సవాలుగా మారింది.ఫ్లాష్ అనేది రిసోర్స్ ఇంటెన్సివ్ అప్లికేషన్. ఇది మైక్రోప్రాసర్ల సామర్థ్యాన్ని మరియు మెమరీ ని కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటుంది.ఇది బ్రౌజర్ క్రాష్ లకు మరియు పనితీరు సమస్యలకు కారణం అవుతుంది.వెబ్ సాంకేతికలు అభివృద్ధి చెందుతున్న కొద్ది ఆధునిక వెబ్ కంటెంట్ ను నిర్వహించడంలో ఫ్లాష్ తక్కువ సామర్థ్యం కలిగి ఉంది మరియు స్థిరమైన, సున్నితమైన వినియోగదారు అనుభవాన్ని అందించలేకపోయింది.అంతేకాకుండా ఫ్లాష్ Apple iOS తో సహా అనేక ఇతర మొబైల్ పరికరాలకు కూడా సపోర్ట్ చేయడం లేదు.వినియోగం పెరగడంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నమొబైల్ టెక్నాలజీ ల్యాండ్ స్కేప్ లో ఫ్లాష్ తన ఔచిత్యాన్ని కోల్పోయింది.
