A Short History of CP/M
CP/M ని 1970ల మధ్యలో Gary Kildall అభివృద్ధి చేశారు. ఇది మైక్రో కంప్యూటర్ల కోసం మొదటి ఆపరేటింగ్ సిస్టంలో ఒకటి మరియు ప్రారంభ వ్యక్తిగత కంప్యూటర్ పరిశ్రమంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.దీనిలో మార్పులు చేయకుండానే విస్తృత శ్రేణి అప్లికేషను అమలు
చేయగలగటం దీని బలం.ఈ అనుకూలత సాఫ్ట్వేర్ డెవలపర్లు మరియు వినియోగదారుల మధ్య ఇది ఒక ప్రముఖ ఎంపికగా మారింది.CP/M యొక్క అసలైన వర్షన్ CP/M 1.0 అని పిలుస్తారు. ఇది 8- బిట్ ప్రాసెసర్ల కోసం రూపొందించబడింది.దీని తర్వాత వర్షన్ లు CP/M 2.2 వంటి తదుపరి సంస్కరణలు Intel 8086 వంటి 16 బిట్ ప్రాసెసర్ లలో పనిచేయడానికి అనువుగా మార్చబడ్డాయి.ఇది ఆపరేటింగ్ సిస్టంకు మరియు హార్డ్వేర్ కు మధ్య ఇంటర్ ఫేసును అందించిన BIOS (Basic Input Output System) పై ఎక్కువగా ఆధారపడింది.CP/M చిన్న చిన్న మార్పులతో వివిధ హార్డ్వేర్ ఫారంలలో పనిచేయగలదని నిర్ధారించడానికి ఈ విధానం సహాయపడింది.
Apple co-founder Steve Jobs unveils the NeXT Cube
1985లో యాపిల్ నుండి బయటకు వచ్చిన తర్వాత స్టీవ్ జాబ్స్ NeXT అనే ఒక కొత్త కంపెనీ స్థాపించారు. అతను సృష్టించిన కంప్యూటర్, ఆల్- బ్లాక్ క్యూబ్ ఒక ముఖ్యమైన ఆవిష్కరణ. దీనిలో మూడు Motorola ప్రాసెసర్లు మరియు 8 MB RAM ఉన్నాయి.దీని ధర 6500 డాలర్లు. మ్యాగ్నటో-
ఆప్టికల్(MO) డిస్క్ డ్రైవ్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ మరియు NeXTSTEP ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ ( తరువాత OPENSTEP గా విడుదల చేయబడింది) దాని ఆవిష్కరణలో కొన్ని.ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టం సాఫ్ట్వేర్ అప్లికేషన్లో వేగవంతమైన అభివృద్ధిని ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 1996లో Apple చే NeXT కొనుగోలు చేసిన వెంటనే కొత్త Mac OS ఆపరేటింగ్ సిస్టంకు పునాదిగా OPENSTEP ఉపయోగించబడింది.
Sound Blaster brand has become synonymous with high-quality computer audio
వ్యక్తిగత కంప్యూటర్ గేమ్ ల కోసం మెరుగైన గ్రాఫిక్స్ మరియు సౌండ్ కోసం డిమాండ్ ఉన్నందున IBM PC కోసం యాడ్ ఆన్ సౌండ్ కార్డులను రూపొందించడానికి కంపెనీలను ప్రోత్సహిస్తుంది.మొదటి సౌండ్ బ్లాస్టర్ కార్డ్ 1989లో పరిచయం చేయబడింది మరియు అప్పటి నుండి సౌండ్
బ్లాస్టర్ బ్రాండ్ నాణ్యమైన కంప్యూటర్ ఆడియోకు పర్యాయపదంగా మారింది. సౌండ్ కార్డులు మార్కెట్లో చాలా ఉన్నప్పటికీ Sound Blaster అదనపు గేమ్ పోర్టును కలిగి ఉన్నందున,ఒక సంవత్సరంలోనే ఇది IBM PC కోసం అత్యధికంగా అమ్ముడైన expansion కార్డుగా మారింది.ఈ సౌండ్ కార్డులు పరిశ్రమకు ప్రామాణికంగా మారాయి.ఒక దశాబ్దానికి పైగా సౌండ్ బ్లాస్టర్ కార్డులు మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోయిన సౌండ్ కార్డులలో ఉన్నాయి.సౌండ్ బ్లాస్టర్ కార్డ్లు ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి, ప్రతి 10 సౌండ్ కార్డ్ అమ్మకాలలో 7 అమ్మకాలు సౌండ్ బ్లాస్టర్ కార్డ్లవే.
The Apple Newton MessagePad,launched in 1993
ఆపిల్ న్యూటన్, 1993 నుండి 1998 వరకు Apple చే అభివృద్ధి చేయబడిన మరియు విక్రయించబడిన పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్(PDA). న్యూటన్ కి సంబంధించిన కొంత ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మరియు తయారీ జపాన్ లోని షార్ప్ కంపెనీ ద్వారా జరిగింది. న్యూటన్ ARM 610 RISK
ప్రాసెసర్ పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది చేతి వేత గుర్తింపు సాఫ్ట్వేర్ ను కలిగి ఉంది. దీనికి ఆపిల్ యొక్క అధికారిక పేరు Message Pad. దీనిలో ఉపయోగించిన ఆపరేటింగ్ సిస్టం పేరు న్యూటన్.న్యూటన్ మెసేజ్ ప్యాడ్ లో 20 MHz ARM 610 ప్రాసెసర్,4 MB ROM మరియు కంపాక్ట్ హ్యాండ్ హెల్డ్ కేసులో ఇన్ఫ్రా రెడ్ భీమింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.దీనిలో స్టైలస్ తో ఉపయోగించడానికి సున్నితమైన మోనోక్రోమ్ డిస్ప్లే కలిగి ఉంది. న్యూటన్ మెసేజ్ ప్యాడ్ అనేది మొదటి హ్యాండ్ హెల్డ్ సిస్టంలలో ఒకటి.
NASA still uses programs from the 70s in their spacecraft
నిపుణుల అభిప్రాయం ప్రకారం, NASA కొత్త కోడ్ ను రాయకూడదని లేదా కొత్త ప్రోగ్రాం లను డిజైన్ చేయకూడదని నిర్ణయించుకుంది. ఎందుకంటే దీన్ని నిర్వహించడం చాలా ఖరీదైనది. దీనితోపాటు, కొత్త ప్రోగ్రాంను అమలు చేయడంలో విపత్తు వైఫల్యం సంభవించే అవకాశాన్ని తగ్గించడానికి
Grace Murray Hopper: Pioneer Computer Scientist
Grace Murray Hopper ప్రోగ్రామింగ్ ప్రపంచంలో విప్లవత్మకమైన ఒక మార్గదర్శక కంప్యూటర్ శాస్త్రవేత్త. ఆమె మెషిన్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ల భావనను ప్రాచుర్యంలోకి తెచ్చింది.ఇది తొలి ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటైన COBOL అభివృద్ధిని ఎనేబుల్ చేసింది.
The History of Ctrl-Alt-Delete
Alt Ctrl Del కీబోర్డ్ కలయిక 1980ల ప్రారంభంలో IBM PC అభివృద్ధి సమయంలో IBM లో David Bradley చే సృష్టించబడింది.ఆ కాలంలో ప్రోగ్రామర్ల యొక్క ప్రధాన సమస్యల్లో ఒకటి, వారి అభివృద్ధి సమయంలో సంభవించే అనివార్యమైన కోడింగ్ అవాంతరాలు.దీనికి పరిష్కారం
ఏమిటంటే ,మొత్తం కంప్యూటర్ యొక్క మాన్యువల్ రీస్టార్ట్ చేయడం. కంప్యూటర్ యొక్క మాన్యువల్ పునఃప్రారంభం చాలా సమయం తీసుకునే అనేక మెమరీ పరీక్షలను ప్రారంభిస్తుంది. ఏ విధమైన మెమరీ పరీక్షను ఎదుర్కోకుండా సిస్టమ్ రీసెట్ ట్రిగ్గర్ చేయడం వల్ల ప్రోగ్రామర్లు తమ విలువైన సమయాన్ని మరియు వనరులను ఆదా చేసుకోవచ్చు.కంప్యూటర్ ను రీస్టార్ట్ చేయడానికి లేదా మిషన్ భౌతికంగా రీసెట్ చేయకుండా సాఫ్ట్ రీబూట్ చేసే బాధ్యతను Bradely కి అప్పచెప్పారు.అతడు Ctrl Alt Del కలయికను ఎంచుకున్నాడు ఎందుకంటే అది అనుకోకుండా నొక్కబడే అవకాశం లేదు. తద్వారా కంప్యూటర్ మళ్లీ రీస్టార్ట్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.క్రాష్ లు మరియు ఫ్రీజ్ లు ఎక్కువగా ఉన్న కంప్యూటర్ ప్రారంభ రోజుల్లో ఇది చాలా ముఖ్యమైనది. అదనంగా, భద్రతా చర్యగా సిస్టంకి లాగిన్ చేయడానికి షార్ట్ కట్ గా కూడా ఉపయోగించబడింది.భౌతికంగా కీబోర్డుకు యాక్సెస్ ఉన్న వినియోగదారులు మాత్రమే లాగిన్ చేయగలరని ఇది నిర్ధారిస్తుంది.మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం ముందు Ctrl Alt Del కలయిక ఉనికిలో ఉండగా, 1990ల ప్రారంభంలో Windows 3.0 పరిచయంతో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. విండోస్ లో Ctrl Alt Del ని నొక్కడం వలన వినియోగదారులు స్పందించని అప్లికేషన్లను ముగించడానికి అనుమతించే టాస్క్ లిస్ట్ అందుబాటులోకి వచ్చింది. సిస్టం వనరులను నిర్వహించడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి ఇది కీలకమైన లక్షణం.
HP 35: The First Handheld Scientific Calculator
మొదటి హ్యాండ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ గా విస్తృతంగా పరిగణించబడుతున్న HP-35 ని 1970లో Hewlett-Packard(HP) సంస్థ పరిచయం చేసింది.ఈ కాలిక్యులేటర్ యొక్క ఖచ్చితత్వం ఆ కాలంలోనే చాలా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ల కంటే ఎక్కువగా ఉంది. ఈ క్యాలిక్యులేటర్ 35
బటన్లను కలిగి ఉన్నందున దీనికి HP-35 అని పేరు పెట్టారు. HP-35 అనేది మెకానికల్ డిజైన్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, ఆల్గోరిథం డెవలప్మెంట్ మరియు అప్లికేషన్ల వినూత్న కలయికగా చెప్పవచ్చు.ఇది లగారిధమిక్ మరియు త్రికోణమితి విధులు నిర్వహించడం తరవాత ఉపయోగం కోసం మరిన్ని ఇంటర్మీడియట్ సొల్యూషన్స్ ను నిల్వ చేయడం మరియు ప్రామాణిక సైంటిఫిక్ ఇన్పుట్ డిస్ప్లే చేయడం వంటివి కలిగి ఉంది వీటివల్ల ఇది అప్పటి పోటీదారుల కంటే చాలా ముందంజలో ఉంది. HP-35 వినియోగదారిని దృష్టిలో ఉంచుకొని రూపొందించారు.
Attack Of The Clones: How IBM Lost Control Of The PC Market
Compaq వారి Compaq పోర్టబుల్ PC ని ప్రకటించింది. ఇది ప్రారంభ పోర్టబుల్ కంప్యూటర్ డిజైన్లో ఒకటి మరియు మరింత ముఖ్యమైనది, మొదటి విజయవంతమైన IBM అనుకూల PC క్లోన్. IBM PC లను క్లోన్ చేయాలని భావించిన దాని సారూప్య కంపెనీలు విఫలమైన చోట Compaq చివరికి
విజయం సాధించింది.ఎందుకంటే వారు తమ ఉత్పత్తిని రెండు విషయాలను రూపొందించడంలో గణనీమైన శ్రద్ధ తీసుకున్నారు.మొదట, వారు మొదటి 100% IBM అనుకూల BIOS ని సృష్టించారు. ఇది ఐబీఎం వారిచే వారి PC కోసం ప్రత్యేకించి తయారు చేయబడినది.క్లీన్-రూమ్ టెక్నిక్లను ఉపయోగించి IBM BIOS ను రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి, వన్ మిలియన్ డాలర్ ను ఖర్చు చేయడం, ఇది కాపీ రైట్ ఉల్లంఘనను నివారించడానికి కూడా వారిని అనుమతించింది.చివరగా వారు IBM,తమకు వ్యతిరేకంగా తీసుకురాబోయే అనివార్య వ్యాజ్యానికి చట్టబద్ధంగా మరియు ఆర్థికంగా సిద్ధమయ్యారు. ఊహించిన విధంగానే అది కొట్టివేయబడింది.క్లీన్ రూమ్, రివర్స్ ఇంజనీరింగ్ BIOS,100% IBM అనుకూల కంప్యూటర్లను సృష్టించగలదని, IBM నుండి చట్టపరమైన సవాలను తట్టుకోగలరని నిరూపించడం ద్వారా, Compaq 1980ల మధ్యలో ప్రారంభమయ్యే IBM- అనుకూల క్లోన్ల వరదకు మార్గము సుగమం చేసింది.ఇది క్రమంగా IBM మార్కెట్ పై పట్టు కోల్పోవడానికి దారితీసింది మరియు PC యుగంలో మైక్రోసాఫ్ట్ మరియు ఇంటెల్ ఆధిపత్య సాంకేతిక సంస్థలుగా ఆవిర్భవించాయి.
First Transistor Radio Goes on Sale
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అసోసియేట్స్ కంపెనీ Regency TR-1, అనబడే ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్సిస్టర్ రేడియోను విక్రయించడం ప్రారంభించింది.Texas Instruments అనే సంస్థ ట్రాన్సిస్టర్ టెక్నాలజీ ని రూపొందించింది మరియు అభివృద్ధి చేసింది.వారి పూర్తి
