The Surprising Story of Pong
ప్రముఖ గేమింగ్ డెవలప్మెంట్ సంస్థ Atari తమ వీడియో గేమ్ ను రూపొందించడానికి నియమించుకున్న ఇంజనీర్ మరియు డెవలపర్ కి వీడియో గేమ్లలో అనుభవం లేదు. డ్రైవింగ్ వీడియో గేమ్ ను అభివృద్ధి చేయడానికి మొదట్లో Allan Alcorn ని నియమించారు. అయితే అతనికి గేమ్లను
అభివృద్ధి చేయడంలో ఎలాంటి అనుభవం లేనందున, అటారి సహ వ్యవస్థాపకుడు Nolan Bushnell అతని నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఒక ప్రాక్టీస్ కోడును అప్పగించాడు. ఆ ప్రాక్టీస్ ప్రాజెక్టు ఈరోజు మనకు తెలిసిన పాంగ్ గేమ్ అయింది. దీనిని 1972లో రిలీజ్ చేశారు. ఇది టెలివిజన్ తన మీద ఆడబడే ఒక సులభమైన టెన్నిస్ గేమ్.
Creeper - The World's First Computer Virus
ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ పేరు creeper. దీని సృష్టికర్త Bob Thomas. ఇతడు దీనిని 1971లో self duplication ప్రయోగంలో భాగంగా సృష్టించాడు. అయితే ఇతని ఉద్దేశం డ్యామేజీ చేయడం, నష్టం చేయడం మాత్రం కాదు. కానీ మొబైల్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో
ప్రదర్శించడం. క్రీపర్ వాస్తవానికి self replicating సాధ్యమేనా అనే భద్రతా పరీక్షగా రూపొందించబడింది. ఈ ప్రోగ్రాం కొత్త హార్డ్ డ్రైవ్ కు సోకగానే తన పాత హోస్టు నుండి తనను తాను నిర్మూలించుకుంటుంది. ఇది చాలా ఆధునిక కంప్యూటర్ వైరస్ ల వలె మాల్వేర్ గా వర్గీకరించబడలేదు. ఇది డేటాను తొలగించలేదు దొంగిలించలేదు లేదా మెయిన్ ఫ్రేమ్ ను పనిచేయకుండా నిరుపయోగంగా చేయలేదు. దీని మెకానిజం చాలా సరళంగా అనిపించినప్పటికీ ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్ కు స్వయంచాలకంగా ప్రసారం చేయగల సాఫ్ట్వేర్ సృష్టించబడటం ఇదే మొదటిసారి.
The Turbo PC Dell's first computer
1985లో DELL సంస్థ Turbo PC ని మార్కెట్లో విడుదల చేయడం ద్వారా కంప్యూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు తెరతీసింది. DELL ఈ PC ని కేవలం 795 డాలర్లకు మాత్రమే అమ్మడంతో ఇది మార్కెట్లో అత్యంత సరసమైన కంప్యూటర్లలో ఒకటిగా నిలిచింది. 1992లో DELL తొలిసారిగా
Brain-The first Boot Sector virus
Brain వైరస్ అనేది ఫ్లాపీ డిస్కుల వుడ్ సెక్టారుకు సోకిన మొదటి బూట్ సెక్టార్ వైరస్. తమ అనుమతి లేకుండా తమ మెడికల్ సాఫ్ట్వేర్ను కాపీ చేయకుండా రక్షించుకోవడానికి పాకిస్తాన్లోని ఇద్దరు సోదరులు దీనిని సృష్టించారు. కానీ అది త్వరగా వారి కస్టమర్ బేస్ దాటి వ్యాపించి విస్తృతమైన
నష్టాన్ని కలిగించింది. Stealth వైరస్ యొక్క మొదటి ఉదాహరణలో Brain వైరస్ కూడా ఒకటి. అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించబడకుండా ఈ వైరస్ దాచుకోగలిగింది. Brain యొక్క ఆవిష్కరణ కంప్యూటర్ వైరస్ల చరిత్రలో ముఖ్యమైన మలుపుగా గుర్తించబడింది. ఇది కొత్త యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడానికి మరియు వినియోగదారులు తమ కంప్యూటర్ సిస్టంలను రక్షించుకోవడంలో మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని ప్రేరేపించింది.
Tony Fadell - The Father of iPod
“Father if iPod” గా పేరు పొందిన Tony Fadell ఐఫోన్ నిర్మించడంలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. Apple లో ఉన్నప్పుడు అతడు iPod యొక్క 18 తరాలు, iPhone యొక్క మొదటి మూడు తరాలను సృష్టించిన బృందానికి నాయకత్వం వహించాడు.2008 లో Apple నుండి
నిష్క్రమించే నాటికి అతడు iPhone/iPod విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. Apple కంటే ముందు అతను ఫిలిప్స్ ఎలక్ట్రానిక్స్ లో మొబైల్ కంప్యూటింగ్ గ్రూపు నిర్మించాడు. Fadell, 100 కన్నా ఎక్కువ పేటెంట్లను కలిగి ఉన్నాడు. అతను మెషిగన్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ తో పట్టభద్రుడ య్యాడు.
The fastest computer worm in history
2004వ సంవత్సరంలో కంప్యూటర్ వార్మ్ “Slammer” వల్ల దాదాపు 15 నిమిషాల పాటు ఇంటర్నెట్ పనిచేయడం మానివేసింది. మాల్వేర్ చాలా చిన్నది (404 బైట్లు ). అది సర్వర్ కు వ్యాప్తి చెందితే అది యాదృచ్ఛిక IP చిరునామాలకు మిలియన్ల కాపీలను పంపుతుంది. దీనివల్ల ఒక బిలియన్
Pokémon fever has gripped the world
Pokemon Go వీడియో గేమ్ విడుదలైన మొదటి వారంలో 15 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది మొదటి నెలలో 200 మిలియన్ డాలర్లను. ఇది Candy Crush గేమ్ మొదటి నెలలో ఆర్జించిన దానికంటే దానికంటే ఏడు రెట్లు ఎక్కువ మరియు Clash Royale ఆర్జించిన దానికన్నా
Sony's PlayStation 2 took the world by storm
జపాన్ కు చెందిన Sony కంపెనీ యొక్క గేమ్ కన్సోల్ Play station 2 అత్యంత విజయవంతమైన వీడియో గేమ్ కన్సోలలో ఒకటిగా పరిగణించ బడుతుంది. Play Station 2 కన్సోల్ Play station కంటే మెరుగైన గ్రాఫిక్ లను అందించింది మరియు ఈ కన్సోల్ ఇప్పటికే చాలామంది
The Main Types of Chips
మైక్రో చిప్ లను సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి లాజిక్ మరియు మెమరీ. లాజిక్ చిప్ లు కార్య కలాపాలు నిర్వహిస్తాయి. మైక్రో ప్రాసెసర్ లు వీటికి ఉదాహరణ. వీటిని మీ కంప్యూటర్, లాప్ టాప్ ల యొక్క మెదడుగా పరిగణించవచ్చు. మెమరీ చిప్ లు డేటాను తాత్కాలికంగా
China overtakes USA in robot density
చైనా 2013లో ప్రపంచంలోని పారిశ్రామిక రోబోట్ ఉత్పత్తిలో 5వ వంతును కొనుగోలు చేసింది. దీనితో అటువంటి సాంకేతికను అత్యధికంగా కొనుగోలు చేసే జపాన్ ను అధిగమించింది. పారిశ్రామిక రోబోట్లు చైనాలోని ఆహారం, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్స్ తో సహా 25
ప్రధాన రంగాలలోవిస్తృతంగా వాడుతున్నారు. 2016లో శ్రామిక రోబోట్లను ఉపయోగించడంలో చైనా జపాన్ ను అధిగమించింది. 2019లో దాదాపు 783,000 యూనిట్లకు చేరుకుంది. ఇది జపాన్ 355,000 యూనిట్ల తో పోలిస్తే రెండు రెట్ల కన్నా ఎక్కువ. 2019లో చైనాలో 71 శాతం కొత్త రోబోలు విదేశీ సరఫరాదారుల నుండి దిగుమతి చేసుకున్నవే. ఇటీవల సంవత్సరాల్లో జపాన్ యొక్క పారిశ్రామిక రోబోట్ లకు చైనా అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం గా ఉంది.
